సర్వర్ అవతారమెత్తిన... కోటీశ్వరుడి కొడుకు

సర్వర్ అవతారమెత్తిన... కోటీశ్వరుడి కొడుకు
x
Highlights

ఆస్తి ఉంటే చాలు ఎలా ఖర్చు చేయాలి, ఎలా జల్సాలు చేయాలనుకుంటారు నేటి కాలంలో కొంత మంది యువత.

ఆస్తి ఉంటే చాలు ఎలా ఖర్చు చేయాలి, ఎలా జల్సాలు చేయాలనుకుంటారు నేటి కాలంలో కొంత మంది యువత. కానీ ఇంటినిండా నౌకర్లు, బయటికి వెల్లాలంటే కార్లు ఉన్నా ఆ యువకుడు మాత్రం అవేమీ వద్దనుకున్నారు. తన సంపాదన పైనే తాను బతకాలనుకున్నారు. ఇంటినుంచి పారిపోయి ఒక చిన్న హోటల్లో సర్వర్ గా పనికి కుదిరాడు. ఇదంతా వింటుంటే ఏదో సినిమా కథ విన్నట్టుగా ఉంది కదా.. కాని ఇది నిజం.

గుజరాత్‌లోని వడోదర జిల్లా పద్రా పట్టణానికి చెందిన ఓ కోటీశ్వరుడి కుమారుడు ద్వారకేశ్ టక్కర్. ఇతనికి చదువు అబ్బక, చదువుకోవడం ఇష్టం లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయిన ఆ యువకుడు నేరుగా సిమ్లాలోని ఓ హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్లి ఏదైనా పని కావాలంటూ అడిగాడు. అతని హుందాతనం, అతని నడవడిక చూసిన మేనేజర్ కి ఆ యువకుడి పై అనుమానం వచ్చి ఐడీ కార్డును అడిగాడు. అది చూసిన మేనేజర్ పద్రా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ద్వారకేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలించారు. అలా గాలిస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న హోటల్ లో ఆ యువకుడు అంట్లు కడుగుతూ కనిపించాడు. అది చూసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories