సీఏఏపై కేరళ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం

సీఏఏపై కేరళ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం
x
Highlights

కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీన పౌరసత్వ చట్ట బిల్లును అమలులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు, ఆందోళణలను...

కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీన పౌరసత్వ చట్ట బిల్లును అమలులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు, ఆందోళణలను చేపట్టారు. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకుంది. రాష్ట్ర ప్రజలంతా సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై ఆందోళనలను కొనసాగించారు. ఈ ఆందోళనలలో ఎంతో మంది వారి ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. మరికొంత మంది పలువురు వివాదాస్పద చట్టాలు చెల్లుబాటు కావుంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లను కూడా దాఖలు చేసారు. దీంతో సుప్రీం కోర్టు ఒక నిర్ణయానికొచ్చింది. ఈ పిటిషన్లను విచారించడానికి ముందుకొచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఈ చట్టం పై కేరళ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశాన్ని అట్టుడికిస్తున్న ఈ చట్టంపై వ్యతిరేక ధోరణిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని బీజేపీయేతర పార్టీలకు చెందిన ప్రముఖులకు, ముఖ్యమంత్రులకూ విజయన్‌ లేఖను రాశారు. భారత దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వివాదాస్పద చట్టాలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. అంతే కాకుండా అసెం‍బ్లీలో ప్రత్యేక తీర్మానం కూడా చేయాలని సూచించారు. ఈ కోణంలోనే కేరళ అసెంబ్లీ సీఏఏకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది.

ఈ సందర్భంగానే కేరళ ప్రభుత్వం చట్టానికి వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని 14, 21, 24 అధికారణలకు ఈ చట్టం తీవ్ర విఘాతం కలిగిస్తోందని పిటిషన్ లో పేర్కొ్ంది. రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించిందని తెలిపింది. ఈ విధంగా చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్రాల్లో తొలి రాష్ట్ర ప్రభుత్వంగా కేరళ నిలిచింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories