Top
logo

సుష్మా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు

సుష్మా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు
X
Highlights

సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణంపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. దేశానికి సుష్మా చేసిన...

సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణంపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. దేశానికి సుష్మా చేసిన సేవలను కొనియాడుతూ‌.... ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. సుష్మా మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ల వర్షం కురుస్తోంది. సుష్మా స్వరాజ్ మృతితో దేశం శోకసంద్రంలో మునిగి పోయింది.. సుష్మాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని పలువురు నేతలు భావోద్వేగానికి గురవుతున్నారు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసిందంటూ ప్రధాని మోడీ ట్వీట్లు చేశారు. సుష్మాజీ అస్తమయం ఎంతో లోటన్న ప్రధాని.. దేశానికి ఆమె చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. సుష్మాను అభిమానించే వారికి ఇది ఎంతో దురదృష్టకరమైన పరిస్థితి. తన ఆలోచనలన్నీ సుష్మా కుటుంబసభ్యులతోనే ఉంటాయి అని మోడీ అన్నారు.

సుష్మా స్వరాజ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు.. సుష్మా స్వరాజ్ మృతి వార్త విని షాక్ అయ్యానని ట్విట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. వీరితో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ట్విట్టర్ లో సంతాపాన్ని తెలిపారు. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా. మదర్ ఇండియా అంటూ సుష్మాపై అభిమానాన్ని చాటుకున్నారు. సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో దేశ వ్యాప్తంగా.. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ నివాళులు అర్పిస్తున్నారు.

Next Story