Top
logo

ప్రభుత్వ లాంఛనాలతో సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు
X
Highlights

సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుష్మా పార్ధివదేహానికి...

సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుష్మా పార్ధివదేహానికి నివాళులర్పించిన తర్వాత.... ఢిల్లీ లోధి స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర జరగనుంది. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సుష్మా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బీజేపీ అగ్ర నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఢిల్లీ లోధి రోడ్‌లోని స్మశాన వాటికలో సుష్మా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువుల సందర్శనార్ధం... మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సుష్మా నివాసంలోనే పార్ధీవదేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత సుష్మా భౌతికకాయాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచే సుష్మా అంతిమయాత్ర మొదలుకానుంది. అనంతరం ఢిల్లీ లోధి రోడ్‌లోని స్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో సుష్మా అంత్యక్రియలు జరగనున్నాయి.

Next Story