ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్‌

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్‌
x
Highlights

దేశరాజధాని ఢిల్లీలో రోజు రోజుకూ కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. అంతేకాక చిన్న పిల్లలు, ముసలి వారు,...

దేశరాజధాని ఢిల్లీలో రోజు రోజుకూ కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. అంతేకాక చిన్న పిల్లలు, ముసలి వారు, గర్భిణులు అనారోగ్యం పాలవుతున్నారు. ఢిల్లీలో పెరిగిపోయిన వాహణాల పొగ వలన వాయు కాలుష్యం, అలాగే శబ్దకాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఈ విషయంపై బుధవారం ఢిల్లీ సుప్రీం కోర్టులో వాదనలు జరిపారు.

ఈ వాదనలను విన్న సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవలసిన చర్యలను ఎందుకు తీసుకోవడంలేదంటూ కేంద్రంపై మండి పడింది. ఇప్పటికైనా సరైన జాగ్రత్తలు తీసుకుని కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలని తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ఢిల్లీలో హైడ్రోజన్ ఆధారిత వాహణాల టెక్నాలజీని ఉపయోగించాలని ఆదేశించారు. ఈ అంశంపై డిసెంబర్‌ 3 నాటికి నివేదిక ఇ‍వ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories