logo
జాతీయం

జమ్మూకాశ్మీర్‌లో బీభత్సంగా కురుస్తున్న మంచు, వర్షం..

జమ్మూకాశ్మీర్‌లో బీభత్సంగా కురుస్తున్న మంచు, వర్షం..
X
Highlights

జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో మంచు బీభత్సంగా కురిసింది. దీంతో అనంత్‌ నాగ్‌లోని జవహర్‌ టన్నెల్ పరిసర...

జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో మంచు బీభత్సంగా కురిసింది. దీంతో అనంత్‌ నాగ్‌లోని జవహర్‌ టన్నెల్ పరిసర ప్రాంతాలను దట్టంగా కప్పేసింది. మంచు కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారుల్లో 5అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. దీనికి తోడు వర్షం కురుస్తుండటంతో జాతీయ రహదారిని మూసేశారు. దీంతో ప్రధాన రోడ్ల వెంబడి వాహనల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జమ్మూకాశ్మీర్‌లో బీభత్సంగా కురుస్తున్న మంచు, వర్షం..

వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఉదంపూర్‌ జిల్లా కగోట్‌ దగ్గర రాంనగర్‌-ఉదంపూర్‌ రహదారి కూడా బంద్ అయింది. అలాగే రంబన్ జిల్లాలో మంచుపెళ్లలు విరిపడడంతో 12 ఏళ్ల బాలిక తో పాలు మరో వ్యక్తి మృతి చెందారు. కాగా ఉత్తర భారతంలో రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. అలాగే లోతట్టు ప్రాంతాలు, కొండచరియల సమీపాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది.

Next Story