logo
జాతీయం

ఎంపీల ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక స్మృతి!

ఎంపీల ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక స్మృతి!
X
Highlights

17వ లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం నాడు... ప్రత్యేకంగా నిలిచారు స్మృతి ఇరానీ. అమేథీ...

17వ లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం నాడు... ప్రత్యేకంగా నిలిచారు స్మృతి ఇరానీ. అమేథీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె... ప్రమాణం చేసేందుకు తన సీటు నుంచీ బయలుదేరగానే... బీజేపీ సభ్యులు... ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ అత్యంత ఎక్కువ సేపు డెస్కులపై క్లాప్స్ కొట్టారు. అంతసేపు బల్లలను చరుచుతుంటే... ఆమె ఎంతో సంతోషించారు. హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన స్మృతి ఇరానీ... ఆ తర్వాత విపక్ష నేతల్ని ముఖ్యంగా యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీని పలకరించారు. అదే సమయంలో సోనియాగాంధీ నమస్కారం పెట్టి ఆమెను పలకరించారు.

Next Story