కశ్మీర్ అంశంపై సుప్రీంలో విచారణ..ఏచూరికి ఊరట

కశ్మీర్ అంశంపై సుప్రీంలో విచారణ..ఏచూరికి ఊరట
x
Highlights

అధికరణ 370 రద్దు సహా కశ్మీర్‌ అంశంపై దాఖలైన 15 వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం వీటిపై వాదనలు స్వీకరించింది.

అధికరణ 370 రద్దు సహా కశ్మీర్‌ అంశంపై దాఖలైన 15 పిటిషన్‌లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సీపీఐఎం చీఫ్‌ సీతారాం ఏచూరి పిటిషన్‌ విచారించిన ధర్మాసనం.. ఆయనను జమ్ముకశ్మీర్‌ వెళ్లేందుకు అనుమతించింది. అక్కడికి వెళ్లిన తరవాత కేవలం అతని సహచరుడు మహ్మద్‌ యూసఫ్‌ తరిగమిని మాత్రమే కలవాలని.. నిబంధనలు ఉల్లంఘిచవద్దని ఆదేశించింది. ఒకవేళ ఆదేశాలు ఉల్లఘించినట్లయితే నివేదిక ఇవ్వాలని కోరింది.

పౌరులు దేశంలో ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అలాగే జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి మహ్మద్‌ అలీం సయ్యద్‌ కూడా తని తల్లిదండ్రులను కలిసేందుకు కోర్టు అనుమతించింది. అనంతనాగ్‌ జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చి రిపోర్టు చేయాలని తెలిపింది. అవసరమైతే అలీంకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories