ముగ్గురు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సిఫారసు చేసిన కొలీజియం

ముగ్గురు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సిఫారసు చేసిన కొలీజియం
x
Highlights

వివిధ హైకోర్టులలో పనిచేస్తున్న ముగ్గురు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టుకు కొలీజియం బుధవారం సిఫారసు చేసింది. కాగా జస్టిస్ ఎస్ మురళీధర్...

వివిధ హైకోర్టులలో పనిచేస్తున్న ముగ్గురు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టుకు కొలీజియం బుధవారం సిఫారసు చేసింది. కాగా జస్టిస్ ఎస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేశారు, జస్టిస్ రంజిత్ మోర్ బొంబాయి హైకోర్టు నుండి మేఘాలయ హైకోర్టుకు, జస్టిస్ మలిమత్ కర్ణాటక నుండి ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ ఆర్ వి మోర్ తో పాటు, జస్టిస్ సత్యరంజన్ సి ధర్మాధికారి, బి పి ధర్మాధికారి కూడా బొంబాయి హైకోర్టు నుంచి ట్రాన్స్ ఫర్ కానున్నారు.

గతవారం రాజీనామా చేసిన జస్టిస్ సత్యరంజన్ సి ధర్మాధికారి, బొంబాయి హైకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి. ఆయన "వ్యక్తిగత కారణాల వల్ల" రాజీనామా చేసినట్లు పేర్కొన్నప్పటికీ, ముంబై నుండి వెళ్ళడానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఒరిస్సా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ కోసం ఆయన పరిగణించబడుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం కూడా సదరు న్యాయమూర్తితో చర్చించినట్లు తెలుస్తోంది. జస్టిస్ ధర్మాధికారి రాజీనామా తరువాత బొంబాయి హైకోర్టులో మూడవ సీనియర్ మోస్ట్ జస్టిస్ గా జస్టిస్ ఆర్ వి మోర్ ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories