కృష్ణమ్మ పరవళ్లు..

కృష్ణమ్మ పరవళ్లు..
x
Highlights

నైరుతి ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్నాటక, మహారాష్ట్రల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో...

నైరుతి ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్నాటక, మహారాష్ట్రల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పరుగులు తీస్తోంది. ఇప్పటికే దీని ప్రభావంతో అల్మట్టే, నారాయణపూర్ డ్యాం లు పూర్తిస్థాయిలో నిండిపోయాయి.

దీంతో దిగువకు నీరు వదులుతున్నారు. నారాయణపూర్‌ డ్యాంకు చెందిన 18 గేట్లను ముందుగానే ఎత్తివేసి లక్షా 2 వేల 420 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ఈ రోజు అర్ధరాత్రికి ఈ వరద తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కువపూర్‌ వద్ద ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం ఉంది. కృష్ణమ్మ తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత ఆ నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు ఇది. దీని నీటి నిల్వ సామర్థ్యం 9.68 టీఎంసీలు. వర్షాలు మరికొన్నాళ్లు ఇలాగే కురిసి వరద ప్రవాహం కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో జల కళ కనిపిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories