సీబీఐ కొత్త డైరెక్టర్ గా శుక్లా

సీబీఐ కొత్త డైరెక్టర్ గా శుక్లా
x
Highlights

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా మధ్యప్రదేశ్‌ మాజీ డీజీపీ రిషి కుమార్‌ శుక్లా(58) నియమితులయ్యారు. ఆయన సీబీఐ...

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా మధ్యప్రదేశ్‌ మాజీ డీజీపీ రిషి కుమార్‌ శుక్లా(58) నియమితులయ్యారు. ఆయన సీబీఐ డైరెక్టర్‌గా రెండేళ్లపాటు కొనసాగుతారని కేంద్ర హోమ్ శాఖ తెలిపింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1983 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన శుక్లా 2016 నుంచి ఈ ఏడాది జనవరి వరకు మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బదిలీ చేసింది. కాగా, శుక్లా ఈనెల 4వ తేదీన సీబీఐ చీఫ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

కాగా కీలకమైన సీబీఐ డైరెక్టర్‌ పదవిని భర్తీ చేయకుండా ఇంకా ఎంతకాలం ఖాళీగా ఉంచుతారని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సిబిఐ డైరెక్టర్ పదవిపై వివాదం నెలకొంది. మరోవైపు సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలను స్వీకరించకుండా ఉన్నందుకు క్రమశిక్షణ చర్యలను చేపట్టింది. మరోవైపు, ఉద్యోగానికి అలోక్ వర్మ చేసిన రాజీనామాను కూడా తిరస్కరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories