Review 2019 : గూగుల్ లో వీటిని తెగ వెతికేశారు!

Review 2019 : గూగుల్ లో వీటిని తెగ వెతికేశారు!
x
Highlights

గూగుల్ ఇప్పడు ప్రపంచ జనాభా ప్రత్యేకమైన నేస్తం. ఆవకాయ నుంచి అంతరిక్షం వరకూ దేని గురించి సమాచారం కావాలన్నా రెండు మాటలు చెప్పితే చాలు వందలాది వివరాలను మన...

గూగుల్ ఇప్పడు ప్రపంచ జనాభా ప్రత్యేకమైన నేస్తం. ఆవకాయ నుంచి అంతరిక్షం వరకూ దేని గురించి సమాచారం కావాలన్నా రెండు మాటలు చెప్పితే చాలు వందలాది వివరాలను మన దగ్గరకు రెప్పపాటు కాలం లో తెచ్చేస్తుంది గూగుల్ సెర్చ్ ఇంజన్. సమాచారం ఏదైనా.. చిటికెలో అందించేస్తుంది గూగుల్. గూగుల్ లో వెతకకుండా ఎటువంటి సమాచార మార్పిడి జరగటం లేదంటే అతిశయోక్తి కాబోదు.

ఈ ఏడాది వివిధ రంగాలకు సంబంధించి వెతుకులాటలో టాప్ టెన్ మీకోసం..

టాప్ క్రికెట్టే!

మన దేశంలో సార్వత్రిక ఎన్నికలకంటే కూడా క్రికెట్ కె ఎక్కువ ఆదరణ ఉంది. ఈ విషయం మెం చెప్పటం లేదు. తన ద్వారా అధిక శాతం మంది వెదికింది క్రికెట్ వరల్డ్ కప్ విశేషాల గురించే అని గూగుల్ చెబుతోంది! మరి ఆ జాబితా చూద్దాం..

1. క్రికెట్ ప్రపంచ కప్, 2. లోక్ సభ ఎన్నికలు 3. చంద్రయాన్-2, 4.కబీర్ సింగ్, 5.ఎవెంజర్స్ ఎండ్ గేమ్, 6. ఆర్టికల్ 370, 7. నీట్ రిజల్ట్స్, 8. జోకర్, 9. కెప్టెన్ మార్వెల్, 10. పీఎం కిషాన్ యోజన

ఎలా చేయాలి?

ఏదన్నా కొత్త విషయం లేదా కొత్త అప్లికేషన్ నుంచి పని చేయడమెలాగో తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్ లో కొట్టేస్తాం. మరి ఈ ఏడాది ఎలా చేయాలి అంటూ వెతికిన వాటిలో ఓటు ఎలా వేయాలి అని అడిగిన ప్రశ్నే టాప్ అంటోంది గూగుల్! ఇంకా ఈ జాబితాలో ఉన్న అంశాలు చూడండి..

1. ఓటు ఎలా వేయాలి?, 2. ఆధార్ ని పాన్ కి ఎలా లింక్ చేయాలి?, 3. ఓటరు లిస్టులో నా పేరు ఎలా చెక్ చేసుకోవాలి? 4. నీట్ ఫలితాల్ని ఎలా చెక్ చేసుకోవాలి?, 5. ట్రాయ్ ప్రకారం ఛానల్స్ ఎలా ఎంపిక చేసుకోవాలి? 6. హొలీ రంగుల్ని ఎలా చెరపాలి? 7. పబ్ జీ ఎలా ఆడాలి?, 8. ఫస్టాగ్ ఎలా తీసుకోవాలి? 9. పోలింగ్ బూత్ ఎలా తెలుసుకోవాలి?, 10. జీఎస్టీఆర్ -9 ఎలా ఫైల్ చేయాలి?

న్యూస్ కోసం..

వార్తల కోసం గూగుల్ వెతకడం సర్వ సాధారణ విషయం కదా. ఈ సంవత్సరం వార్తఅంశాల్లో మాత్రం లోక్ సభా ఎన్నికలు టాప్ సెర్చ్ లోనిలిచాయి.

1.లోక్ సభ ఎన్నికలు, 2. చంద్రయాన్-2, 3.ఆర్టికల్ 370, 4. పీఎం కిసాన్ యోజన, 5. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, 6. హరియాణా అసెంబ్లీ ఎన్నికలు, 7. పుల్వామా దాడి, 8.సైక్లోన్ ఫొనీ, 9. అయోధ్య తీర్పు, 10. అమెజాన్ ఫారెస్ట్ ఫైర్.

అది ఎక్కడ ఉంది?

కొత్తగా ఎక్కడికన్నా వెళ్ళినపుడు ఏదైనా కావాలంటే వెంటనే గూగుల్ లో వెతికేస్తాం.. అది ఎక్కడ ఉంది అంటూ.. అలా ఎక్కువగా వెతికిన వాటి జాబితా చూడండి.. 1. నా దగ్గర్లో డ్యాన్స్ శిక్షణ కేంద్రం 2. దగ్గర్లో సెలూన్, 3. దగ్గర్లో కాస్ట్యూమ్ స్టార్, 4.. దగ్గర్లో మొబైల్ స్టార్, 5. దగ్గర్లో చీరల దుకాణం, 6. ఇక్కడి గాలి నాణ్యత ఎంత? 7. దగ్గర్లో ఫర్నీచర్ దుకాణం, 8. దగ్గర్లో పిల్లల బొమ్మల దుకాణం, 9. దగ్గరలో ఎలక్ట్రానిక్స్ దుకాణం, 10. దగ్గర్లో స్పా ఎక్కడ ఉంది?

అభినందన్ కోసం వెదుకులాట!

సరిహద్దుల్ని దాటి పాక్ విమానం పై విరుచుకు పడి.. శత్రువుల చేతిలో చిక్కుకుని క్షేమంగా మాతృదేశం తిరిగి వచ్చి హీరో అయిపోయారు అభినందన వర్ధమాన్. సెలబ్రిటీలను మించిన సెలబ్రటీగా అయిపోయిన ఈ వైమానిక దళ వింగ్ కమాండర్ కోసమే గూగుల్ లో ఎక్కువ మంది వెతికారు.

1.అభినందన వర్ధమాన్ 2. లతా మంగేష్కర్, 3. యువరాజ్ సింగ్, 4. ఆనంద్ కుమార్, 5. విక్కీ కౌశల్, 6. రిషబ్ పంత్, 7. రానూ మండల్, 8. తారా సుతారియా, 9. సిద్ధార్థ్ శుక్లా, 10. కోయినా మిత్రా.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories