Top
logo

తాజా సర్వే… బీజేపీకి షాక్‌.. జగన్ జోరు..

తాజా సర్వే… బీజేపీకి షాక్‌.. జగన్ జోరు..
X
Highlights

మరి కొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశంలోని బీజేపీ తన పూర్వవైభవం కోల్పోతుందని రిపబ్లిక్ సి...

మరి కొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశంలోని బీజేపీ తన పూర్వవైభవం కోల్పోతుందని రిపబ్లిక్ సి ఓటర్ సర్వే వెల్లడించింది.2014 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏకు 99 సీట్లు తగ్గే అవకాశముందని సర్వే అంచనా వేసింది. 237 సీట్లు మాత్రమే గెలిచే అవకాశముందని తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే యూపీఏ కూటమి భారీగా పుంజుకోనుంది.

యూపీఏ 166 సీట్లు దక్కించుకునే అవకాశముంది. ఎన్డీఏ, యూపీఏలో భాగస్వాములు కాని పార్టీలు 140 స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే తేల్చింది. మొత్తంగా చూస్తే ఎన్డీఏకు 35 శాతం, యూపీఏకు 33 శాతం ఓట్లు పడతాయని అంచనా వేసింది. అలాగే ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి 19 ఎంపీ స్థానాలు వస్తాయని పేర్కొంది. అలాగే సీఎం చంద్రబాబు సారథ్యంలోని అధికార టీడీపీ 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే చెప్పింది.

Next Story