అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లకు ధన్యవాదాలు : రాహుల్‌ గాంధీ

అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లకు ధన్యవాదాలు : రాహుల్‌ గాంధీ
x
Highlights

1991లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చారు. దీంతో 28 సంవత్సరాలుగా ప్రభుత్వం గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. కాంగ్రెస్‌...

1991లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చారు. దీంతో 28 సంవత్సరాలుగా ప్రభుత్వం గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ప్రాణహాని తగ్గిన్నట్లే్ అని తేలడంతోనే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపహరించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ను ఉపహరించడంతో రాహుల్ గాంధీ తీవ్ర భావోద్వేగానికి గురుయ్యాడు.

ఇన్నాళ్లు తనకు, తన కుటుంబానికి రక్షణగా నిలిచిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్పీజీ) వారికి రాహుల్ కృతఙ్ఞతలు తెలిపారు. తన కోసం, తన కుటుంబం రక్షణ కోసం అంకిత భావంతో కష్టపడిన వారినందరినీ అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు అని సంబోధించారు. " కొన్నేండ్లుగా నన్ను, నా కుటుంబాన్ని రక్షించడానికి నిర్విరామగా కృషి చేసిన SPG సిబ్బందిలో పనిచేస్తున్న నా సోదరులు, సోదరీమణులందరికీ ధన్యవాదాలు. మీ అంకితభావానికి, ఆప్యాయతతో మమ్మల్ని అభిమానించినందుకు వారికి ధన్యవాదాలు అని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన ట్విట్ చేశారు. ఇదే కోణంలో ఇప్పుడు 3 వేల మంది ఎస్పీజీ సైనికుల రాష్ట్రపతి, దేశ ప్రధానికి భద్రత కోసం ప్రభుత్వం వినియోగించనుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories