Punjab Police: పంజాబ్‌లో పోలీసుల దౌర్జన్యం

Punjab Police: కారుకు అడ్డొచ్చాడని కొట్టిన పోలీసులు

Rama Rao
Updated on: 23 Sept 2022 11:32 AM IST
Punjab Police Thrashed a Youth in Mohali
X

Punjab Police: పంజాబ్‌లో పోలీసుల దౌర్జన్యం

Punjab Police: పంజాబ్‌లో పోలీసుల దౌర్జన్యాలు రోజు రోజుకూ శృతి మించుతున్నాయి.. చిన్న కారణానికి మొహాలీలో పోలీసులు యువకుడిని గొడ్డును బాదినట్లు బాదారు. పోలీసుల ఓవర్‌ యాక్షన్‌తో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువకుడు పోలీసుల కారుకు అడ్డొచ్చాడు. డ్రైవర్‌ హారన్‌ కొట్టాడు.. ఇయర్‌ ఫోన్‌ పెట్టుకోవడంతో యువకుడికి హారన్‌ సౌండ్ వినిపించలేదు. దీంతో కోపంతో ఊగిపోతూ కారు దిగిన పోలీసులు యువకుడిని ఇష్టం వచ్చినట్లు.. లాఠీలు విరిగే దాకా కొట్టారు. రోడ్డుపైన ఇదంతా చూస్తున్న ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. వీడియో వైరల్‌ కావడంతో అధికారులు పోలీసులను సస్పెండ్‌ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story