హెల్మెట్ లేదని బండి ఆపారు.. లారీ ఢీ కొని ఆమె కాళ్ళు పోయాయి!

హెల్మెట్ లేదని బండి ఆపారు.. లారీ ఢీ కొని ఆమె కాళ్ళు పోయాయి!
x
Highlights

పోలీసులు ఆపుతున్న కంగారులో స్కూటీ సడెన్ బ్రేక్ వేసిన యువతిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడం తో యువతి రెండు కాళ్ళూ కోల్పోయిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

ట్రాఫిక్ రూల్స్ పాటించమని పబ్లిక్ ని హెచ్చరించే క్రమంలో ఓ యువతి రెండు కాళ్ళూ కోల్పోయే పరిస్థితి వచ్చిన సంఘటన చెన్నై లో చోటు చేసుకుంది. హెల్మెట్ లేదని పోలీసులు ఒక యువతిని ఆపారు. సరిగ్గా ఇదే సమయంలో వెనుకగా వస్తున్న లారీ ఆ యువతి బైక్ ని వెనుకనుంచి ధీ కొట్టింది. దీంతో ఆ యువతి లారీ చక్రాల కింద పడిపోయింది. ఆమె కాళ్ళపై నుంచి లారీ వెళ్ళడంతో రెండు కాళ్ళూ చితికిపోయాయి.

సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

చెన్నై సెన్‌గుండ్రమ్‌ సమీపంలోని పాడియనల్లూర్‌ జ్యోతినగర్‌కు చెందిన యువనేష్‌ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవల ప్రియా (23) అనే యువతితో వివాహం జరిగింది. శుక్రవారం ప్రియా తల్లి పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కొనడానికి స్కూటర్‌పై రాత్రి 7.30 గంటల సమయంలో కేకేనగర్‌ సమీపంలోని బేకరీకి వెళ్లింది. అదే సమయంలో సెన్‌గుండ్రమ్‌–తిరువళ్లూరు రోడ్డుపై ఎస్‌ఐ కుమారన్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. కేక్‌ తీసుకుని తిరుగు ప్రయాణమైన ప్రియాను హెల్మెట్‌ ధరించకపోవడంతో కానిస్టేబుల్‌ ఆపమని కర్రతో సైగ చేశాడు.

దీంతో ప్రియా హఠాత్తుగా బ్రేక్‌ వేసింది. అదే సమయంలో సెన్‌గుండ్రమ్‌ నుంచి వస్తున్న లారీ స్కూట్‌ను ఢీకొంది. అదుపుతప్పి కిందపడిన ప్రియాపై లారీ చక్రం ఎక్కిదిగడంతో ఆమె రెండు కాళ్లు చితికిపోయాయి. స్థానికులు ఆమెను హుటాహుటిన చెన్నై ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ప్రియా కిందపడడానికి పోలీసులే కారణమని ఆగ్రహించిన స్థానికులు రాస్తారోకో చేపట్టారు. లారీ అద్దాలను ధ్వంసం చేశారు. ఓ బైక్‌ను తగుబెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో తిరువళ్లూరు ఎస్పీ అరవిందన్, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ – ఇన్‌స్పెక్టర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా మార్పు రాకపోవడంతో లాఠీ చార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories