శభాష్ పోలీస్ అన్నా..యావత్తు దేశం సెల్యూట్

శభాష్ పోలీస్ అన్నా..యావత్తు దేశం సెల్యూట్
x
Highlights

ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను యావత్ ప్రజలు తెగ మొచ్చుకుంటున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడాడు.

ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను యావత్ ప్రజలు తెగ మొచ్చుకుంటున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడాడు.. దీంతో దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి భారీ వర్షాలతో గుజరాత్ అల్లకల్లోలం అవుతున్న విషయం తెలిసిందే. అయితే లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఎయిర్‌ పోర్స్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. వరదప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు.

అలా వెళ్లిన వారికి ఓ చోట ఇద్దరు చిన్నారులు కనిపించారు. నీళ్లల్లో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో వారికి గమనించిన పోలీస్ కానిస్టేబుల్ పృథ్విరాజ్ సింగ్ జడేజా వారిని ఎలాగైనా కాపాడి ఒడ్డుకి చేర్చాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే చిన్నారుల దగ్గరికి వెళ్లి వారిద్దరిని తన భుజాలపైకి ఎత్తుకుని.. నడుములోతు నీళ్లలో దాదాపు కిలోమీటరన్నర వరకు పిల్లను భూజాలపై ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చాడు. అయితే ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో బంధించాడు. ఇక ఈ విషయం కాస్తా అక్కడి ము‌ఖ్యమంత్రి విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. ఆ కానిస్టేబుల్‌పై తెగ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం తన ట్విట్టర్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేసి.. ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠినశ్రమ, సంకల్పం, అంకితభావాలతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు పృథ్విరాజ్ ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. వారి నిబద్ధతను అభినందించండి అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతోంది. కానిస్టేబుల్ చేసిన సాహసం కామెంట్ల రూపంలో నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. శభాష్ పోలీస్ అన్నా.. నీ ధైర్యానికి మా సెల్యూట్స్ అంటూ.. యావత్తు దేశం సెల్యూట్ చేస్తోంది. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories