రేపు జాతినుద్దేశించి మోదీ కీలక ప్రసంగం

రేపు జాతినుద్దేశించి మోదీ కీలక ప్రసంగం
x
Highlights

ప్రధాని నరేంద్రమోడీ రేపు జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను కట్టబట్టే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ,...

ప్రధాని నరేంద్రమోడీ రేపు జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను కట్టబట్టే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ, రాష్ట్రపతి సంతకం పెట్టిన వేళ, దేశ ప్రధాని మోదీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, తీసుకున్న చర్యలు, ఆర్టికల్‌ 370 రద్దు... తదితర అంశాలను దేశ ప్రజలకు వివరించనున్నారు. ఇక రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ కూడా రేపే జాతినుద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది.ఇదే సమయంలో బుధవారం అఖిలపక్ష భేటీకి కూడా ప్రధాని కార్యాలయం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ తేదీ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారోన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సోమవారం ఉదయం రాజ్యసభలో అమిత్ షా కాశ్మీర్‌పై కీలక ప్రకటన చేశారు. కాగా ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ నిప్పులు చెరిగారు. కశ్మీర్ విభజన అనే దాన్ని నేను కలలో కూడా ఊహించలేదని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయం నెత్తిన బాంబు వేసినట్టు అనిపించిందని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్ షా నిర్ణయంతో కశ్మీర్ పై అణుబాంబు వేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories