ఉగ్రదాడిపై స్పందించిన ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్‌

ఉగ్రదాడిపై స్పందించిన ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్‌
x
Highlights

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామాలో జ‌రిగిన ఉగ్రదాడి ఘ‌ట‌న‌పై పాకిస్తాన్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్ స్పందించారు. ఈ సందర్బంగా పాకిస్థాన్ మ‌రో మాజీ...

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామాలో జ‌రిగిన ఉగ్రదాడి ఘ‌ట‌న‌పై పాకిస్తాన్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్ స్పందించారు. ఈ సందర్బంగా పాకిస్థాన్ మ‌రో మాజీ అధ్య‌క్షుడు అసిఫ్ అలీ జ‌ర్దారీ.. ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప‌ట్ల తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇమ్రాన్‌కు అంత‌ర్జాతీయ రాజ‌కీయాల‌పై స‌రైన అవగాహన లేదని ఆయన అప‌రిప‌క్వంగా ప్ర‌వ‌ర్తించార‌ని, ఈ విషయంలో భార‌త్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఇమ్రాన్ స‌రిగా తిప్పికొట్టలేకపోయారన్నారు. కాగా ఈ దాడికి దాడికి పాల్ప‌డింది.. జైషే ఉగ్ర‌వాదే అని ముష్ర‌ర‌ఫ్ అన్నారు. అయితే ఇందులో పాకిస్థాన్ హ‌స్తం లేదని ఆయన అన్నారు.

ఓ ప్రైవేటు టీవీ ఛాన‌ల్‌కు ఆయ‌న ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. పుల్వామా దాడి దారుణ‌మ‌ని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు. గతంలో త‌న మీద కూడా జైషే ఉగ్రవాద సంస్థ దాడి చేసింద‌ని, ఈ సంస్థ‌పై ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడా సానుభూతి ఉందని అన్నారు. ప్ర‌స్తుతం పాకిస్థాన్ ప‌రిస్థితి స‌రిగాలేద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆ దేశం ఇలా చేయ‌ద‌న్నారు. కాగా ఈనెల 14వ తేదీన పుల్వామాలో జ‌రిగిన దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తప్పించుకునే ధోరణిలో మాట్లాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories