విమానంలో దుస్తులు విప్పి నగ్నంగా..

విమానంలో దుస్తులు విప్పి నగ్నంగా..
x
Highlights

విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన ఒంటిపై దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా తిరుగుతూ ఇతర ప్రయాణికులకు ఆందోళన కలిగించాడు. ఈ ఘటన దుబాయ్-లక్నో ఎయిరిండియా...

విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన ఒంటిపై దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా తిరుగుతూ ఇతర ప్రయాణికులకు ఆందోళన కలిగించాడు. ఈ ఘటన దుబాయ్-లక్నో ఎయిరిండియా విమానంలో నిన్న (శనివారం) చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్ నుంచి ఎయిరిండియా విమానంలో శనివారం లక్నో వస్తున్నాడు.

అతను ఉన్నట్టుండి ఒక్కసారిగా దుస్తులు విప్పేసి నగ్నంగా అటూఇటూ తిరగడం ప్రారంభించాడు.దాంతో ఇతర ప్రయాణికులు కేకలు వేశారు. అతడు చేసిన బిత్తిరి చర్యకు వెంటనే స్పందించిన విమాన సిబ్బంది అతడి ఒంటిపై దుస్తులు కప్పి సీట్లో కూర్చోబెట్టారు. అయినా ఆ వ్యక్తి వాటిని కూడా విప్పేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, దుస్తులు ఎందుకు విప్పాడన్న విషయంపై అతడిని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories