మిగిలింది కొన్నిగంటలే...కాంగ్రెస్ లోక్‌సభా నేత ఎవరనేది తేలలేదు..!

మిగిలింది కొన్నిగంటలే...కాంగ్రెస్ లోక్‌సభా నేత ఎవరనేది తేలలేదు..!
x
Highlights

రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నా ఓటమి షాక్ నుంచి కాంగ్రెస్‌ పార్టీ కోలుకున్నట్లు కనిపించడం లేదు. లోకసభలో సభాపక్షం నేతగా ఎవరిని...

రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నా ఓటమి షాక్ నుంచి కాంగ్రెస్‌ పార్టీ కోలుకున్నట్లు కనిపించడం లేదు. లోకసభలో సభాపక్షం నేతగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత ఎవరన్నది సస్పెన్స్ వీడలేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నేతలను కోలుకోకుండా చేశాయి. తీవ్రమనస్థాపం చెందిన రాహుల్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకే విముఖత చూపడంతో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తారా అన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అయ్యాయి. గత సభలో విపక్ష నేతగా సత్తాగా కొనసాగిన మల్లిఖార్జున్ ఖర్జే ఓటమి చవిచూశారు.

గెలుపొందిన నేతల్లో సీనియర్ నేతలు ఎవరూ లేకపోవడంతో లోక సభపక్షం నాయకుడుగా ఎవరిని నియమించాలో తేల్చులేకపోతున్నారు. మరో వైపు గాంధీ కుటుంబానికి విధేయుడు ఆంగ్లం, హిందీ భాషల్లో పట్టున్న నేత కోసం కాంగ్రెస్ పార్టీ జల్లెడ పడుతున్నట్లుగా పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు. సుధీర్ఘ కాలం రాజ్యసభలో కాంగ్రెస్ తరపున ప్రితినిధ్యం వహించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం ముగియడంతో ఆయన కూడా ఇక నుంచి సభలో కనిపించరు. సరైన సమయంలో నియామకాలు ఉంటాయని చెబుతూవచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లోకసభ పక్షం నేత, డిప్యూటీ లీడర్ గా ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories