5 వేల మందికి విడాకులిచ్చిన ఎన్నారైలు

5 వేల మందికి విడాకులిచ్చిన ఎన్నారైలు
x
Highlights

ఎన్నారైలు గత మూడేళ్లలో సుమారు 5వేల మందికి విదాకులిచ్చేశారు. నమ్మడం లేదు కదూ. మీరెంటీ మన పార్లమెంట్ సభ్యులూ ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. కానీ, ఇదే నిజం....

ఎన్నారైలు గత మూడేళ్లలో సుమారు 5వేల మందికి విదాకులిచ్చేశారు. నమ్మడం లేదు కదూ. మీరెంటీ మన పార్లమెంట్ సభ్యులూ ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. కానీ, ఇదే నిజం. వివిధ కారణాలతో పెళ్లి చేసుకున్న తరువాత భార్యలను వదిలేసినా ఎన్నారైల సంఖ్య మూడేళ్ళలో 4,698. ఈ విషయాన్ని పార్లమెంట్ లో విదేశాంగ మంత్రి వీ మురళీధరన్ చెప్పారు.

ఈ విషయంపై పార్లమెంటులో తలెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీంతో ఈ సమాధానం విన్న పార్లమెంటు సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ వ్యవధిలో అంతమంది మహిళలకు అన్యాయం జరగడం తమకు దిగ్భ్రాంతి కలగజేస్తోందని వ్యాఖ్యానించారు. 2016-19 మధ్య మూడేళ్లలో మొత్తం 4,698 మంది మహిళలు తమ ఎన్నారై భర్తలు తమను వదిలేశారని విదేశాంగ శాఖకు తెలిపారు. ఈ మూడేళ్లలో 2016లో అత్యధికంగా 1510 మంది మహిళలను భర్తలు వదిలేయగా.. 2017లో ఈ సంఖ్య 1498కి తగ్గింది. 2018లో 1299కి చేరిన బాధితుల సంఖ్య ఈ ఏడాది మే 31 నాటికి 391కు చేరింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పార్లమెంటుకు మురళీధరన్ సమాధానమిచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories