నో గ్రీటింగ్ కార్డ్స్..ఓన్లీ స్టిక్కర్స్

నో గ్రీటింగ్ కార్డ్స్..ఓన్లీ స్టిక్కర్స్
x
Highlights

కొన్ని సంవత్సరాల క్రితం కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు వారం రోజుల నుంచి పిల్లలంతా హడావుడిగా ఉండే వారు.

కొన్ని సంవత్సరాల క్రితం కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు వారం రోజుల నుంచి పిల్లలంతా హడావుడిగా ఉండే వారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవాలనుంటే గ్రీటింగ్ కార్డులను ఇచ్చి నూతన సంవత్సన శుభాకాంక్షలు తెలిపేవారు. స్నేహితులంతా ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి గ్రీటింగ్స్ ఇచ్చుకునేవారు. ఇక అందుబాటులో లేకుండా దూరంగా ఉండే వారికి మంచి మంచి గ్రీటింగ్ కార్డులను వారం ముందే పోస్ట్ చేసేవారు. అప్పడు రూ.1 నుంచి రూ.1000 వరకు ఖరీదు చేసే గ్రీటింగ్ కార్డులను షాపు యజమానులు అమ్మేవారు. న్యూయర్ వచ్చిందంటే చాలు దుకాణదారులు గ్రీటింగ్స్ అమ్మడంలో బిజీ బిజీగా ఉండేవారు.

ఇక పాఠశాల పిల్లలు, గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా హీరో, హీరోయిన్ల ఫొటోలతో ఉన్న గ్రీటింగ్స్‌, గులాబీ పువ్వులతో ఉన్న గ్రీటింగ్స్ తీసుకోవడానికి మక్కువ చూపేవారు. అంతే కాదు పట్టణాల్లో, పల్లెల్లో ముంగిల్లలో రంగుల ముగ్గులు వేసి సంబరాలు జరుపుకునేవారు. పెద్దలు, చిన్న పిల్లలు అందరూ కలిసి ఒక్క చోట చేరి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందంగా గడిపే వారు.

కానీ రాను రాను ప్రపంచం మారిపోతుంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న కొద్ది అలవాట్లు, ఆచారాలు మారిపోతున్నాయి. దేనికైనా టెక్నాలజీనే వాడుకుంటున్నారు. ఆత్మీయులను శుభకార్యాలకు పిలవాలన్నా, శుభాకాంక్షలు తెలపాలన్నా దేనికైనా సరే స్మార్ట్ ఫోన్నే వాడుతున్నారు. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఈ మెయిల్స్‌లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఇంటర్నెట్‌లో విభిన్నరకాల గ్రీటింగ్‌ స్టిక్కర్లతో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. పక్కన ఉన్న మనిషికి కూడా శుభాకాంక్షలను నోటితో, చెప్పడం మానేసి మెసేజెస్ రూపంలో చెపుతున్నారు.

అంతే కాదు ఒప్పుడు నూతన సంవత్సరం వచ్చిందంటే చాలా మంది యువత ఆలయానికి వెళ్లి ఏడాదంతా హాయిగా గడవాలని, తమ జీవితం కొత్త సంవత్సరంలో బాగుండాలని సంవత్సరాన్ని ప్రారంభించేవారు. కానీ ఇప్పటి కాలంలో కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు పబ్బులు, డిస్కోలు, పార్టీలు అంటూ బయటకు వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసుండడం మానేసి స్నేహితులతోనే ఎక్కువగా కాలం గడుపుతుంది యువత.. కాలం మారుతున్న కొద్ది సమాజంలో ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో చూడాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories