కర్ణాటకలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది: ఉత్తమ్‌ కుమార్‌

కర్ణాటకలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది: ఉత్తమ్‌ కుమార్‌
x
Highlights

కర్ణాటకలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు...

కర్ణాటకలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఇటువంటి అప్రజాస్వామ్య ఘటనలు జరిగిన దాఖలాలు లేవని ఉత్తమ్‌ అన్నారు.

ఇక మరో వైపు కర్ణాటక రాజకీయాలు ముంబై నుంచి ఢిల్లీ చేరాయి. చీలిక వర్గ ఎమ్మెల్యేల రాజీనామాల విషయమై సుప్రీంకోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోనుందని సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం10 కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను విచారించనున్నారు. ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories