బాబోయ్..ఇలా అయితే మావల్ల కాదు!

బాబోయ్..ఇలా అయితే మావల్ల కాదు!
x
Highlights

ముంబాయిలో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. అక్కడ ఎలాంటి వానలు కురుస్తున్నాయంటే.. జూన్ఫ్ నెల మొత్తంలో కురవాల్సిన వాన నాలుగు రోజుల్లో కురిసింది....

ముంబాయిలో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. అక్కడ ఎలాంటి వానలు కురుస్తున్నాయంటే.. జూన్ఫ్ నెల మొత్తంలో కురవాల్సిన వాన నాలుగు రోజుల్లో కురిసింది. ముంబై జూన్ నెల వర్షపాత సగటు 550 మిల్లీ మీటర్లు కాగా నాలుగురోజుల్లోనే అంతకు మించిన వర్షపాతం నమోదైంది. దీంతో నగరం మొత్తం గందరగోళంగా తయారైంది. రైళ్లు, విమానాలు, బస్సులు, విద్యుత్.. ఇలా అన్ని సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలైన దాదర్‌లోని హింద్‌మాతా చౌక్, కంజూర్‌మార్గ్, సియాన్ తదితర ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి.

అక్కడి పరిస్థితులు అదుపులోకి తీసుకురావడం, సేవలను పునరుద్ధరించడం బృహన్ ముంబై కార్పోరేషన్ చూసుకోవాలి. కానీ, ఇది ఇపుడు వారికి తలకు మించిన భారంగా తయారైంది. ఈ విషయంపై బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పరదేశీ మాట్లాడుతూ ముంబైలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 85 శాతం వర్షపాతం నమోదైందన్నారు. జూన్ మొత్తంలో కురవాల్సిన వర్షం నాలుగు రోజుల్లోనే కురిసిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా కురవలేదని చెప్పారు. ఈ దశాబ్దంలో ఇలా కురవడం ఇదే తొలిసారని తెలిపారు. నజీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ ప్రయత్నం చేస్తున్నామని, కానీ ఈ స్థాయిలో వర్షం పడుతుంటే తామేమీ చేయలేమని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories