గున్న ఏనుగుని కాపాడినందుకు తల్లి ఏనుగు కృతజ్ఞతలు

గున్న ఏనుగుని కాపాడినందుకు తల్లి ఏనుగు కృతజ్ఞతలు
x
Highlights

ఒక మనిషికి సాటి మనిషి సాయం చేసినప్పుడు కృతజ్ఞతలు తెలుపుతారు. అది సహజమే కానీ అదే స్వభావం, కృతజ్ఞతా భావం జంతువుల్లోనూ ఉంటాయని నిరూపించింది ఈ ఏనుగు. ...

ఒక మనిషికి సాటి మనిషి సాయం చేసినప్పుడు కృతజ్ఞతలు తెలుపుతారు. అది సహజమే కానీ అదే స్వభావం, కృతజ్ఞతా భావం జంతువుల్లోనూ ఉంటాయని నిరూపించింది ఈ ఏనుగు. అటవీప్రాతంలో తిరుగుతున్న ఒక ఏనుగుల గుంపు నుంచి ఒక గున్న ఏనుగు గుంతలో పడిపోయింది. అదిపడిపోగానే అక్కడున్న ఏనుగులు దాన్ని కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేశాయి. అది ఫలించకపోవడంతో ఏనుగులన్నీ దిగులుచెందాయి.

ఆ విషయాన్ని తెలుసుకున్న అటవీ అధికారులు ఆ ఏనుగును కాపాడటానికి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంతలో పడిన చిన్న ఏనుగు పిల్లను కాపాడటానికి ప్రొక్లెయిన్‌ సహాయంతో గుంతలో మెళ్లిగా మట్టిని పోయడం మొదలు పెట్టారు. ఆ గుంతలో ఉన్న ఏనుగుపిల్ల ఆ మట్టిమీద అడుగులు వేస్తూ మెళ్లిగా బయటికి వచ్చింది. అది బయటికి రావడం చూసిన ఏనుగుల గుంపు పిల్ల ఏనుగు దగ్గరికి చేరాయి. ఏనుగులన్నీ ఆ పిల్ల ఏనుగుతో అడవిలోకి దారి పట్టాయి. కానీ తల్లి ఏనుగు మాత్రం అక్కడ ఒక నిమిషం ఆగి గున్న ఏనుగును కాపాడిన అటవీ సిబ్బంధికి తొండం పైకెత్తి కృతజ్ఞతలు తెలిపింది. ఆ సీన్ ని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో నెటిజన్ల ఫోన్లలో చక్కర్లు కొడుతుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories