పాకిస్థాన్‌కు మరో షాక్.. భారత్‌కు రష్యా మద్దతు

పాకిస్థాన్‌కు మరో షాక్.. భారత్‌కు రష్యా మద్దతు
x
Highlights

పక్కా ప్లానింగ్‌.. ఊహకందని వ్యూహం.. ప్రతిపక్షాలకు కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండా జమ్మూకాశ్మీర్‌పై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌కు...

పక్కా ప్లానింగ్‌.. ఊహకందని వ్యూహం.. ప్రతిపక్షాలకు కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండా జమ్మూకాశ్మీర్‌పై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని.. దీనికి సంబంధించిన ఆర్టికల్‌ 370, 35ఏను రద్దు చేస్తూ తీర్మానం చేసింది. దీనిపై రష్యా విదేశాంగ శాఖ స్పందించింది. భారత రాజ్యాంగం పరిధి మేరకే కశ్మీర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొంది. కాగా ఈ సందర్భంగా రష్యా కూడా శిమ్లా ఒప్పందం గురించే ప్రస్తావించింది. జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు విభజించడంలో రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించింది అని రష్యా ఆర్టికల్‌ 370 రద్దుపై తమ వైఖరి స్పష్టం చేసింది.

కేంద్రసర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల భారత్‌, పాక్‌ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకుండా రెండు దేశాలు సంయమనం పాటిస్తాయని విశ్వసిస్తున్నామని రష్యా విదేశాంగ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది. కాగా జమ్మూ కశ్మీర్‌ విషయంలో నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను కట్టడి చేయాల్సిందిగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంతర్జాతీయ సమాజాన్ని కోరిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories