కరోనాపై పోరుకు సహాయపడతాం.. జీ జిన్‌పింగ్‌కు మోదీ లేఖ...

కరోనాపై పోరుకు సహాయపడతాం.. జీ జిన్‌పింగ్‌కు మోదీ లేఖ...
x
Highlights

చైనాలో కరోనావైరస్ మరణాల సంఖ్య ఆదివారం 811 కి చేరుకుంది.. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు వైరస్ సవాలును...

చైనాలో కరోనావైరస్ మరణాల సంఖ్య ఆదివారం 811 కి చేరుకుంది.. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు వైరస్ సవాలును ఎదుర్కోవటానికి చేయూతనిచ్చారు. చైనాకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ మేరకు జిన్‌పింగ్‌కు లేఖ రాశారు.

కరోనావైరస్ వ్యాప్తి జరిగిననెల రోజుల తరువాత ఈ విషయంపై వారి మొదటి కమ్యూనికేషన్ ఇది. ఈ సందర్బంగా "చైనా అధ్యక్షుడు మరియు ప్రజలకు" సంఘీభావం తెలిపిన మోదీ, వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పయిన మృతులకు సంతాపం తెలిపారు. అలాగే హుబీ ప్రావిన్స్ నుంచి భారతీయ పౌరులను తరలించడానికి వీలు కల్పించినందుకు చైనా ప్రభుత్వానికి ప్రశంసలు కూడా తెలిపారు.

చైనాకు అడిగినట్లయితే సహాయం అందించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పిన మూడు రోజుల తరువాత మోదీ ఈ లెటర్ రాశారు. కాగా ఏప్రిల్ 2018 లో, ఇద్దరు నాయకులు మొదటి అనధికారిక శిఖరాగ్ర సమావేశానికి వుహాన్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే.

మరోవైపు ఓషదాల తోపాటు.. ప్రసిద్ది చెందిన వైద్య నిపుణులు ఈ క్లిష్టమైన సమయంలో చైనాకు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారని.. భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా శుక్రవారం భారత భారత రాయబారి సన్ వీడాంగ్‌తో జరిగిన సమావేశంలో ప్రతిపాదనను తెచ్చారు.

భారత విదేశాంగ కార్యదర్శి ను కలవడం ఆనందంగా ఉంది. చైనా-ఇండియా సంబంధాల ప్రోత్సాహం గురించి చర్చించాం, ముఖ్యంగా ద్వైపాక్షిక సమన్వయం మరియు కొరోనావైరస్ వ్యతిరేకంగా పోరాటంపై సహకారం వంటి విషయాలు చైనా రాయబారి చర్చించినట్టు ష్రింగ్లా మీటింగ్ అనంతరం ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే చైనా అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, శనివారం 89 మరణాలు నమోదయ్యాయి - ఇంతమంది మరణించడం చైనా చరితలో మొదటిసారి.. ఇప్పటికే మృతుల సంఖ్య 811 కి చేరుకుంది. అంతేకాదు కొత్తగా 2,656 కేసులు నమోదయ్యాయి. ధృవీకరించబడిన అంటువ్యాధుల సంఖ్య ఇప్పుడు 37,198 ని తాకింది.

దక్షిణ చైనా భూభాగం, హాంకాంగ్ మరియు ఇతర ప్రాంతాలలో 700 మందికి పైగా మరణించిన 2002-03 SARS మహమ్మారి తో పోల్చుకుంటే కరోనావైరస్ మృతుల సంఖ్య ఎక్కువ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తన రోజువారీ నివేదికలో తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories