logo
జాతీయం

మంత్రులూ.. నిర్ణీత సమాయానికి ఆఫీసుకు రండి

మంత్రులూ.. నిర్ణీత సమాయానికి ఆఫీసుకు రండి
X
Highlights

కేంద్రమంత్రులకు ప్రధాని నరేంద్రమోదీ క్లాస్ పీకారు. ఇంటి నుంచి పనిచేసే అలవాటును మానుకోవాలని, ఉదయం 9:30...

కేంద్రమంత్రులకు ప్రధాని నరేంద్రమోదీ క్లాస్ పీకారు. ఇంటి నుంచి పనిచేసే అలవాటును మానుకోవాలని, ఉదయం 9:30 గంటలకల్లా కార్యాలయాలకు చేరుకోవాలని ఆదేశించారు. అలాగే, పార్లమెంటు సమావేశాలు జరిగే 40 రోజులూ తప్పకుండా హాజరుకావాలని, ఆయా రోజుల్లో ఇతర పనులు పెట్టుకోవద్దని సూచించారు.

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసుకు నిర్ణీత సమయానికే చేరుకునేవాడనినని గుర్తు చేశారు. మంత్రులు కూడా సమయానికి కార్యాలయానికి వచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక తొలిసారి మంత్రులతో సమావేశమయిన సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. మంత్రులు, ఎంపీల మధ్య పెద్దగా తేడాలేదని, కాబట్టి ఎంపీలను కలిసేందుకు మంత్రులు కొంత సమయం కేటాయించాలని సూచించారు.

Next Story