'కర్నాటకం': అవిశ్వాసం.. డెడ్ లైన్లు.. మధ్యలో నిమ్మకాయ!

కర్నాటకం: అవిశ్వాసం.. డెడ్ లైన్లు.. మధ్యలో నిమ్మకాయ!
x
Highlights

కర్నాటక అసెంబ్లీలో మంచి థ్రిల్లర్ సినిమా కథ నడుస్తోందిప్పుడు. ఒక పక్క ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క ఎలాగైనా...

కర్నాటక అసెంబ్లీలో మంచి థ్రిల్లర్ సినిమా కథ నడుస్తోందిప్పుడు. ఒక పక్క ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క ఎలాగైనా నిలబెట్టాలనే తపనతో సీఎం కుమారస్వామి ఎత్తులు వేస్తున్నారు. ఇటు గవర్నర్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని డెడ్ లైన్లు పెడుతుంటే..అటు దానిని దాటించడానికి స్పీకర్ తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఈ ఉదయం నుంచీ అక్కడి పరిణామాలు రకరకాలుగా మారుతున్నాయి.

ఇదంతా ఇలా ఉంటే, సీఎం కుమారస్వామి సోదరుడు, క్యాబినెట్ మంత్రి హెచ్ డీ రేవణ్ణ చేతిలో నిమ్మకాయతో సభలోకి ప్రవేశించారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చేతబడి ప్రయత్నమే అని వారు ఆరోపణలతో సభను దద్దరిల్లేలా చేశారు.

దీనిపై కుమారస్వామి మండిపడ్డారు. "ఓ నిమ్మకాయ తెచ్చాడని రేవణ్ణను అనుమానిస్తున్నారా! హిందూ సంస్కృతిని నమ్మే మీరే అతడిపై దాడి చేస్తున్నారు. గుడికి వెళుతూ నిమ్మకాయ తీసుకెళ్లడం రేవణ్ణకు అలవాటు. కానీ మీరు అతడిపై చేతబడి ఆరోపణలు చేస్తున్నారు. అయినా చేతబడి చేస్తే ప్రభుత్వం నిలబడేది సాధ్యమేనా?" అంటూ నిప్పులు చెరిగారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories