సినిమాలు జూన్ నెల తరువాతే!

సినిమాలు జూన్ నెల తరువాతే!
x
Highlights

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమాహాళ్ళు మూతపడ్డాయి. 70 రోజులుగా సినిమాలు నడవకపోవడంతో థియేటర్ యాజమాన్యాలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమాహాళ్ళు మూతపడ్డాయి. 70 రోజులుగా సినిమాలు నడవకపోవడంతో థియేటర్ యాజమాన్యాలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా విడుదలకు సిద్ధం అయ్యి లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమాల నిర్మాతల పరిస్థితీ అగమ్యగోచరంగా మారిపోయింది.

ఇటీవల లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ళు తప్ప దాదాపుగా అన్ని వ్యాపార కేంద్రాలు సుదీర్ఘ కాలం తరువాత తెరుచుకున్నాయి. ఈ నేపధ్యంలో సినిమాల విడుదలకు మార్గం సుగమం అవుతుందని అందరూ భావించారు. ఈ మేరకు కేంద్రం కనికరిస్తుందని సినిమా ఇండస్ట్రీ భావిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడప్పుడే సినిమా పరిశ్రమకు కేంద్రం పచ్చ జెండా ఊపే పరిస్థితి లేదని స్పష్టం అవుతోంది.

సినిమా హాళ్లను తిరిగి తెరిచే విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే విషయమై జూన్ తర్వాత మాత్రమే ఆలోచిస్తామన్నారు. ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యను, పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

సినిమా రంగంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సినిమా థియేటర్లను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యలపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల తర్వాత ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ రోజుకు రూ. 30 కోట్లకు పైగా నష్టపోతున్నప్పటికీ లాక్‌డౌన్‌పై సినీరంగం సంఘీభావంగా ఉందని మంత్రి ప్రశంసించారు. సినీ సంఘాల ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories