logo
జాతీయం

పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తున్నా : ప్రముఖ దర్శకుడు

పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తున్నా : ప్రముఖ దర్శకుడు
X
Highlights

బీజేపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లుకు నిరసనగా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ...

బీజేపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లుకు నిరసనగా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు మణిపూర్‌ చలన చిత్ర దర్శకుడు అభిరాం శ్యామ్‌ శర్మ. ఈ మేరకు అవార్డును తిరిగి పంపిస్తునట్టు తెలిపారు. పార్లమెంట్‌లో 500కు పైగా ఎంపీలు ఉంటే తమ రాష్ట్రం నుంచి కేవలం ఒక్కరిద్దరే ఉన్నారని.. వారు తమ ఆవేదనను ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఈశాన్య భారతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని 83 ఏళ్ల శర్మ అన్నారు. కాగా కేంద్రం బలవంతగా బిల్లును అమలుచేయడం సరికాదన్నారు. ఇదిలావుంటే ఇమాగి నింగతెమ్, ఇషనౌ వంటి సినిమాలు అభిరాం శ్యామ్‌ శర్మకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన చిత్ర పరిశ్రమకు సేవలను గుర్తిస్తూ.. ప్రభుత్వం 2006లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

Next Story