యూపీ రాజధాని లక్నోలో వ్యక్తి హంగామా..చెట్టుపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు.. సిఎం యోగిని కలిపించాలని డిమాండ్

Lucknow: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఒక వ్యక్తి హంగామా సృష్టించాడు

Rama Rao
Published on: 4 Nov 2022 1:23 PM IST
Lucknow Man Climbs Tree in Front of Gautampalli Police Station Demanding to Meet CM Yogi Adityanath
X

యూపీ రాజధాని లక్నోలో వ్యక్తి హంగామా..

Lucknow: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఒక వ్యక్తి హంగామా సృష్టించాడు. స్థానికులు, పోలీసులను పరుగులు పెట్టించాడు. గౌతంనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఎత్తైన చెట్టు ఎక్కిన వ్యక్తిని కిందకు దించేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు. తనను యూపీ సిఎం యోగీ ఆదిత్యానాథ్‌తో కలిపించాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. మెడలో ఉరితాడు కట్టుకుని రాత్రి నుంచి చెట్టుపైనే పడుకున్నాడు.

మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నవారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతను కిందపడితే ప్రమాదం జరగకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వలలు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఎంతకూ దిగిరాకపోవండతో అంతా తలలు పట్టుకుంటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story