రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
x
Highlights

లింగ సమానత్వం, అసమానతలను రూపుమాపేందుకే ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించినట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు. రాజ్యసభలో...

లింగ సమానత్వం, అసమానతలను రూపుమాపేందుకే ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించినట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ... ఇటీవల కాలంలో సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇస్లామిక్ దేశాలు సైతం ట్రిపుల్ తలాక్ నిషేధించాయని గుర్తు చేశారు. దేశంలోని మహిళలు ఓ వైపు రోదసి యాత్రలు చేస్తుంటే మరో వైపు ట్రిపుల్ తలాక్ వంటి జాడ్యాలతో వివక్ష ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. మహిళల హక్కుల కోసం ఉద్దేశించిన ఈ బిల్లును ప్రతి ఒక్కరూ సమర్ధించాలంటూ కోరారు. ఎవ‌రైనా ట్రిపుల్ త‌లాక్ చెబితే, వారిపై క్రిమిన‌ల్ చ‌ర్యలు తీసుకునే వీలు క‌ల్పిస్తున్నామ‌న్నారు. మ‌హిళా బాధితురాలు మాత్రమే ఇక నుంచి ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌వ‌చ్చు అని అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 113 మంది ఉండగా... వ్యతిరేకంగా 118 ఉన్నట్టుగా తెలుస్తోంది. 9 మంది సభ్యులు ఈ బిల్లు విషయంలో తటస్థంగా ఉన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories