పుల్వామా ఉగ్రదాడి మరువక ముందే.. మరో హెచ్చరిక..

పుల్వామా ఉగ్రదాడి మరువక ముందే.. మరో హెచ్చరిక..
x
Highlights

పుల్వామా దాడి ఘటన మరవకముందే భారత నిఘా వర్గాలు మరో హెచ్చరిక జారీచేశాయి. త్వరలో 500 కిలోల ఐఈడీతో పెను విధ్వంసం సృష్టించడానికి జైషే మహ్మద్‌ సంస్థ ప్లాన్‌...

పుల్వామా దాడి ఘటన మరవకముందే భారత నిఘా వర్గాలు మరో హెచ్చరిక జారీచేశాయి. త్వరలో 500 కిలోల ఐఈడీతో పెను విధ్వంసం సృష్టించడానికి జైషే మహ్మద్‌ సంస్థ ప్లాన్‌ వేసినట్టు వెల్లడైంది. చౌకీబల్‌ – తాంగ్‌ధర్‌ మార్గంలో ఒకటి రెండు రోజుల్లోనే భారీ దాడి జరిగే అవకాశముందని తెలిసింది. ఈసారి ఆత్మాహుతి దాడికి ఆకుపచ్చ రంగు స్కార్పియో వాహనాన్ని ఉపయోగించి.. ఏకంగా 500 కిలోల ఐఈడీ ని పేల్చి భారీ విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైనట్లు స్పష్టమైంది. 'తాంజిమ్‌' ఉగ్రవాద సంస్థ నుంచి నిఘా వర్గాలు ఈ సమాచారాన్ని రాబట్టాయి. పాకిస్థాన్ లోని సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కుట్రను కనుగొన్నాయి. ఈసారి పెద్దమొత్తంలో ప్రజలని, సైన్యాన్ని అంతమొందించాలని ఉగ్రమూకలు ప్లాన్ చేస్తునట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి.

'మోదీ సర్కారు అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ముందుకెళితే ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడతామని ఈనెల 5న మసూద్‌ అజర్‌ సోదరుడు రఫూవ్‌ అస్ఘర్‌… పాక్‌లో ఓ సభలో హెచ్చరించాడు. ఆ తరువాత పుల్వామాలో ఆత్మహుతి దాడి జరిగింది. ఇక మనవేలితో మన కళ్లే పొడవాలనే కుట్రతో కాశ్మీర్ యువతను ఇందుకోసం వాడుకుంటున్నట్టు సమాచారం రాబట్టింది. అందుకే కాశ్మీర్ యువతతోనే నిరసనలు చేయిస్తూ.. ఆ క్రమంలో బోర్డర్ ను దాటడానికి టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. దాదాపు 4 నుంచి 6 మంది ఉగ్రవాదులు.. కాశ్మీర్ లో చొరబడడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నిఘా వర్గాల హెచ్చరికలతో భారత సైన్యం అప్రమత్తమైంది. ఏ క్షణమైనా ఉగ్రవాదులను మట్టుబెట్టే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories