ఐటీఆర్ దాఖలు చేయాల్సిందేనా..?

ఐటీఆర్ దాఖలు చేయాల్సిందేనా..?
x
Highlights

ఐటీఆర్ అంటే (ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్) దీన్ని డబ్బు సంపాదించే వారు ప్రతి ఒక్కరూ దాఖలు చేసుకోవల్సి ఉంటుంది.

ఐటీఆర్ అంటే (ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్) దీన్ని డబ్బు సంపాదించే వారు ప్రతి ఒక్కరూ దాఖలు చేసుకోవల్సి ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ లాభమే కాని నష్టం ఉండదు. ఇదిలా ఉంటే మోదీ ప్రభుత్వం 2019 కేంద్ర బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిబేట్‌ను కూడా ప్రకటించింది. ఎవరైతే ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారో వారికి కూడా ఇది వర్తిస్తుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నా కూడా రిబేట్ పొందాలంటే కచ్చితంగా ఐటీఆర్ (ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్) దాఖలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం 2019 బడ్జెట్ ప్రకారం నిర్ణయించింది.

ఐటీఆర్ గురించి ఇండియామనీ.కామ్ సీఈవో, ఫౌండర్ సీఎస్ సుధీర్ ఒక సమావేశంలో మాట్లాడారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే ఐటీఆర్ మాత్రమే దాఖలు చేసుకోవాలని తెలిపారు. ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. దాంతో పాటు ఆదాయపు పన్ను మినహాయింపులు ఈ విధంగా ఉంటాయని తెలిపారు. 60 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు వయస్సుగల వారి ఏడాది ఆదాయం రూ.3 లక్షల వరకు ఉంటే ఎలాంటి పన్ను ఉండదన్నారు.

ఒక వేల ఎక్కువ ఆదాయం సంపాదిస్తే అప్పుడు పన్ను కచ్చితంగా కట్టవలసిందే కాబట్టి ఐటీఆర్ ధాఖలు చేసుకోవాలని తెలిపారు. ఐటీఆర్ దాఖలు చేయకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే అప్పుడు ట్యాక్స్ నోటీసు వస్తుందని తెలిపారు. అదే ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల సెక్షన్ 87ఏ కింద వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే ఐటీఆర్ రిబేట్ పొందొచ్చని తెలిపారు. స్థూల వార్షిక ఆదాయం ఎంతో ప్రతీ ఎడాది తెలియజేయాలని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories