అభినందన్‌ వెన్నెముకకు గాయం

అభినందన్‌ వెన్నెముకకు గాయం
x
Highlights

పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టే క్రమంలో తాను ప్రయాణిస్తున్న మిగ్21 విమానం కూలిపోవడంతో పాక్ గడ్డపై అడుగుపెట్టాడు భారత వాయుసేన వింగ్ కమాండర్...

పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టే క్రమంలో తాను ప్రయాణిస్తున్న మిగ్21 విమానం కూలిపోవడంతో పాక్ గడ్డపై అడుగుపెట్టాడు భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. దీంతో అతను పాక్ ఆర్మీ వద్ద 48 గంటల పాటు బందీగా ఉండిశుక్రవారం విడుదల అయ్యారు. కాగా శత్రుసైన్యం చేతిలో బందీగా ఉన్న సమయంలో తాను తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వర్ధమాన్‌కు వెన్నెముక కింది భాగంలో గాయమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే పాకిస్తాన్‌లో అల్లరిమూకలు చేసిన దాడిలో అభినందన్‌ పక్కటెముక ఒకటి దెబ్బతిందని వెల్లడించాయి. ఎంఆర్‌ఐ స్కాన్‌లో ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్‌ లేనట్లు తేలిందని పేర్కొన్నాయి. కాగా యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్‌ ఫిట్‌గా ఉన్నారా? లేదా? తెలుసుకునేందుకు బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌లో ఉండే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌లో సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకోసం ఆయన త్వరలో బెంగుళూరు వెళ్లనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories