హ్యాట్సాఫ్ ధోనీ!

హ్యాట్సాఫ్ ధోనీ!
x
Highlights

క్రికెట్ లో పోరాట యోధుడు. బౌలర్ వేసిన బంతి బ్యాట్స్ మెన్ ను దాటి వెనక్కి పోకుండా కాచుకుంటూ, జట్టుకు సేవలందించే కీలక ఆటగాడు.. ఎంతటి ఒత్తిదిలోనైనా కూల్...

క్రికెట్ లో పోరాట యోధుడు. బౌలర్ వేసిన బంతి బ్యాట్స్ మెన్ ను దాటి వెనక్కి పోకుండా కాచుకుంటూ, జట్టుకు సేవలందించే కీలక ఆటగాడు.. ఎంతటి ఒత్తిదిలోనైనా కూల్ గా జట్టుని ముందుకు నడిపించిన నాయకుడు.. ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సరిహద్దుల్లో పహారా కాస్తున్నాడు. ఎవరో ఈపాటికే అర్థం అయివుంటుంది. అవును మహేంద్ర సింగ్ ధోనీ! అంకిత భావానికి మారుపేరుగా క్రికెట్ చరిత్రలో ప్రత్యేక పేజీ సృష్టించుకున్న ఆటగాడు ధోనీ.

ఇప్పుడెక్కడ ఉన్నాడు..

కల్లోల కాశ్మీరంలో సరిహద్దు గ్రామాల్లో పహారా కాస్తున్నాడు ధోనీ. టెరిటోరియల్‌ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నిజానికి ధోనీకి ఆ పదవి ఎప్పటినుంచో ఉంది. కానీ, ఇటీవల కాలంలో తాను ప్రత్యక్షంగా ఆర్మీలో పనిచేయాలని అనుకున్తున్నాననీ, దానికి అనుమతి ఇవ్వమనీ ఆర్మీ అధికారులను కోరాడు ధోనీ. దానికి సానుకూలంగా స్పందించిన ఆర్మీ అధికారులు అతనికి సరిహద్దుల్లో సేవలు చేసే అవకాశం కల్పించారు. అయితే, లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీకి ప్రత్యేకంగా క్వార్టర్స్ ఇస్తారు. కానీ, ధోనీ దానిని తీసుకోలేదు. సాధారణ సైనికుడిలా సైనికుల మధ్య బరేక్స్ లోనే ఉంటున్నారు. అందరు సైనికులతో పాటు తానూ విధులు కచ్చితంగా నిర్వర్తిస్తున్నాడు.

సైన్యంలో ధోనీ ఏం చేస్తాడు?

అవును ఎవరికైనా వచ్చే సందేహం ఇదే. సైన్యంలో చేరాలంటే బోలెడంత ట్రైనింగ్ ఉంటుంది. చాలా కష్టపడాలి. ఆయుధాలు వాడటం రావాలి అని అందరూ అనుకుంటారు. నిజమే..కనీ, ధోనీ కొంత గస్తీకి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నారు. అందుకే గస్తీ విధుల్లో సరిహద్దు గ్రామాల్లో పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన అక్కడ వీరోచితంగా పోరాడే అవకాశాలున్నాయని ఎవరూ అనుకోనక్కర్లేదు. కానీ, కోట్లాది మంది అభిమానులున్న ధోనీ వంటి స్టార్ ఆటగాడు తమ మధ్య తమతో పాటు.. ఉన్నదంటే అక్కడ ఉన్న సాధారణ సైనికుల మనసుల్లో ఎంత ధైర్యం వస్తుందో చెప్పగలమా? ఆ ధైర్యం ఒక్కోరూ వందమంది సైనికుల్లా శత్రువుల పైకి దూకేందుకు స్ఫూర్తి ఇస్తుందనడంలో సందేహం లేదు.

కల్లోలం..

ప్రస్తుతం ధోనీ విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో కల్లోల పరిస్థితులు ఉన్నాయి. అక్కడి గ్రామాలన్నీ ఇప్పుడు పాక్ యుద్ద భయం గుప్పెట్లో ఉన్నాయి. అక్కడి ప్రజలకు ధైర్యం మన సైన్యం జరిపే గస్తీ. ఆ గస్తీ దళంలో ధోనీ వంటి వ్యక్తీ విధులు నిర్వర్తించడం ఓ చరిత్రగా నిలిచిపోతున్దనడంలో సందేహం లేదు. ఇక్కడి 106టీఏ పార బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ధోనీ ఆగస్టు 15 వరకూ అక్కడే ఉంటారు. సైన్యానికి చెందిన రెండు స్పెషల్‌ ఫోర్సు బెటాలియన్లు కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాయి. ఇవి వాస్తవాధీనన రేఖను కాపాడటం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో పాల్గొనడం వీటి విధి. ఈ క్రమంలోనే ధోనీ సాధారణ గార్డ్‌ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది.

హ్యాట్సాఫ్..

తన చర్యలతో ప్రత్యర్థి కేప్తేన్లకు కొరకరాని కొయ్యలా నిలిచినా ధోనీ.. మైదానం బయట కూడా అందరికీ అందనంత ఎత్తున నిలుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీ నిర్వర్తిస్తున్న విధులు చాలా కఠిన తరమైనవి. యుద్ద మేఘాలు కమ్ముకున్న వేళ సరిహద్దుల్లో పహారా కాయడం మామూలు విషయం కాదు. ఇటువంటి నిరుపమాన సేవను ఆర్మీకి అందిస్తూ యావత్ సైన్యానికీ ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నాడు మహేంద్రుడు. ఈయన అనితర ధైర్యానికి, దేశ భక్తికీ ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!



Show Full Article
Print Article
More On
Next Story
More Stories