logo
జాతీయం

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..
X
Highlights

తెలుగురాష్ట్రాల్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి...

తెలుగురాష్ట్రాల్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పారు ప్రజలు. 2018 డిసెంబర్ 31st సందర్బంగా 2018కు అత్మీయ వందనం తెలుపుతూ యువతతో పాటు పలువర్గాలు చెందిన వ్యక్తులు విందు వినోదాలతో వేడుకలు నిర్వహించుకున్నారు. విద్యార్థులు కేక్‌లు కట్ చేసి పంచుకున్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలు దాటగానే 2019 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ టపాసుల మోతలతో పలు నగరాలు, పట్టణాలు గ్రామాలలో సందడి నెలకొంది.

కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటు సంబరాలు జరుపుకున్నారు. యువకులు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బైక్‌ల మీద ప్రధాన వీధుల గుండా తిరుగుతూ కేరింతలు కొట్టారు. సోమవారం మహిళలు ఉత్సాహంగా తమ ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి వాకిళ్లను అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో, అన్నీ శుభాలు కలగాలని భక్తులు పూజలు చేస్తున్నారు. అలాగే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి నగరాల్లో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లో తెల్లవారుజాము వరకు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి.

Next Story