logo

మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లే ఆఫర్లు..

మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లే ఆఫర్లు..
Highlights

మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లకు తెరదించింది....

మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లకు తెరదించింది. ఇందులో బ్రాండెడ్ కంపెనీల గాడ్జెట్లను డిస్కౌంట్ల రూపంలో విక్రయిస్తోంది. వీటిలో.. హానర్ 9N, నోకియా 6.1 ప్లస్, శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8, మరియు వివో V9 ప్రో. Poco F1, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 8, మరియు మోటరోలా వన్ పవర్ వంటి హ్యాండ్సెట్లు డిస్కౌంట్లో వస్తాయని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. అంతేకాకుండా ప్రముఖ కంపెనీల లాట్ టాప్ లు, హెడ్ ఫోన్లు, స్పీకర్లు, కెమెరాలు, మరియు పవర్ బ్యాంక్లతో సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ఫ్లిప్ కార్ట్ అమ్మకాల్లో 80 శాతం డిస్కౌంట్ ను ప్రకటిస్తున్నట్టు వెల్లడించింది.

ఇందులో భాగంగా ఆనర్ 9N అసలు ధర రూ. 11.999 ఉండగా.. దాన్ని రూ .9,999కే అందుబాటులో ఉంచింది. అలాగే నోకియా 6.1 ప్లస్ అసలు ధర రూ. 15.499 ఉండగా అది 13,999 లభించనుంది. వివి V9 ప్రో అసలు ధర 15.990 ఉండగా.. రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 13.990 కే అందుబాటులో ఉంది.

అంతేకాదు జెన్‌ఫోన్ లైట్‌ ఎల్1 అత్యధికంగా రూ. 4,999 డిస్కౌంట్‌పై లభించనుంది. రూ. 71,000గా ఉన్న 64 జీబీ గూగుల్‌ పిక్సెల్‌ 3 విమెన్స్‌ డే సేల్‌లో రూ.59,999 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 రూ. 30,990కే పొందవచ్చు.


లైవ్ టీవి


Share it
Top