జార్ఖండ్‌లోని డుమ్కాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కాలిపోయిన మూడు వాహనాలు

Jharkand: ట్యాంకర్ పేలి ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలు

R Tripura Malini
Published on: 28 Oct 2022 10:45 AM IST
Gas tanker exploded in Dumka and three buses were burnt
X

జార్ఖండ్‌లోని డుమ్కాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కాలిపోయిన మూడు వాహనాలు

Fire Accident: జార్ఘండ్‎లోని డుమ్కాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్‎తో వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఒక్కసారిగా గ్యాస్ ట్యాంకర్ పేలి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. గ్యాస్ ట్యాంకర్ పేలడంతో పక్కనే ఉన్న మూడు బస్సులకు మంటలు అంటుకున్నాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో మూడు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న ఓ ఇల్లు సైతం మంటల్లో కాలిబూడిదైంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేలోపే నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి తీవ్ర గాయలుకాగా..వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story