ప్రణబ్‌ ముఖర్జీ తోపాటు మరో ఇద్దరికీ భారతరత్న పురస్కారం

ప్రణబ్‌ ముఖర్జీ తోపాటు మరో ఇద్దరికీ భారతరత్న పురస్కారం
x
Highlights

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని భారతరత్న పురస్కారం వరించింది. భారతరత్న పురష్కారాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రణబ్ తోపాటు రాజ్యసభ...

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని భారతరత్న పురస్కారం వరించింది. భారతరత్న పురష్కారాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రణబ్ తోపాటు రాజ్యసభ మాజీ సభ్యుడు నానాజీ దేశ్‌ముఖ్‌, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.

ప్రణబ్‌ ముఖర్జీ : 1935 డిసెంబర్‌ 11న జన్మించిన ప్రణబ్‌ ముఖర్జీ అంచలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కేంద్ర ఆర్థిక, రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2006 వరకు రక్షణమంత్రిగా, 2009 నుంచి 2012 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

నానాజీ దేశ్‌ముఖ్‌: నానాజీ దేశ్‌ముఖ్ జనసంఘ్ నాయకులు. మాజీ రాజ్యసభ సభ్యులు. నానాజీ తన 93వ ఏట 2010 ఫిబ్రవరిలో కన్నుమూశారు.












సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికా : 1926 సెప్టెంబర్ 8వ తేదీన అస్సాంలోని సాదియాలో జన్మించిన భూపేన్ హజారికా ప్రముఖ సంగీత విద్వాంసుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. కవి, సంగీత కూర్పరి, నటుడు, గాయకుడు, జర్నలిస్ట్, రచయిత, చిత్ర దర్శకుడిగా హజారికా ఉన్నత శిఖరాలను అధిరోహించారు.




Show Full Article
Print Article
Next Story
More Stories