logo
జాతీయం

చెన్నైలో మరో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 150 కార్లు..

చెన్నైలో మరో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 150 కార్లు..
X
Highlights

బెంగళూరు ఎయిరో షోలో భారీ అగ్ని ప్రమాదం ఘటన మరువకముందే…. చెన్నైలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ...

బెంగళూరు ఎయిరో షోలో భారీ అగ్ని ప్రమాదం ఘటన మరువకముందే…. చెన్నైలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు కారు గోడౌన్‌లో భారీగా మంటలు వ్యాపించాయి. సుమారు 200కు పైగా కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. పోరూరులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 150 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. 5 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఎండుగడ్డి ఉన్న ప్రాంతం కావడంతో మంటలు దట్టంగా వ్యాపిస్తున్నాయి.

పెద్ద సంఖ్యలో కార్లు పార్క్‌ చేసి ఉన్న ప్రాంతంలో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లో వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మంటల్లో కొంత మంది వ్యక్తులు చిక్కుకున్నా… ఫైర్‌ సిబ్బంది వారిని క్షేమంగా బయటకు తీసుకురాగలిగారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story