కొత్త పుంతలు తొక్కుతున్న డ్రగ్స్‌ మాఫియా

కొత్త పుంతలు తొక్కుతున్న డ్రగ్స్‌ మాఫియా
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

డ్రగ్స్ మాఫియా రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతూ పోలీసులకు సవాళ్ళను విసురుతున్నారు. ఎన్ని రకాలుగా పోలీసులు గస్తీ కాసి డ్రగ్స్ ముఠాను అరికట్టాలని చూస్తున్నా వారు మాత్రం కొత్త పంథాలో ముందుకు వెళుతూ కొరకరాని కొయ్యగా మారారు.

డ్రగ్స్ మాఫియా రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతూ పోలీసులకు సవాళ్ళను విసురుతున్నారు. ఎన్ని రకాలుగా పోలీసులు గస్తీ కాసి డ్రగ్స్ ముఠాను అరికట్టాలని చూస్తున్నా వారు మాత్రం కొత్త పంథాలో ముందుకు వెళుతూ కొరకరాని కొయ్యగా మారారు. ప్రతిసారీ పోలీసులకు అడ్డంగా పట్టుబడుతున్నామని ఈసారి ఆ కేటుగాళ్లు వెరైటీగా ట్రై చేశారు. అయితే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కొత్త తరహాలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ కేటుగాళ్లు రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు దొరికిపోయారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసులు చెకింగ్ లో భాగంగా పెళ్లి కార్డులు బాగా బరువుగా ఉండటంతో అనుమానం వచ్చి సోదా చేసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. పెళ్లి పత్రికలు ఓపెన్ చేసి చూసిన అధికారులు ...కొన్ని కేజీల డ్రగ్స్ దొరకడంతో ఒకింత కంగుతిన్నారు. బెంగళూరు నుంచి ఆస్ట్రేలియా తరలించేందుకు యత్నించిన ముఠాను ముఠాను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. దాదాపుగా ఐదు కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ దొరకడంతో పెద్ద కలకలాన్ని సృష్టిస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories