కేజ్రీవాల్ ఆగ్రహం తరువాత తుది వివరాలను ప్రకటించిన ఈసీ

కేజ్రీవాల్ ఆగ్రహం తరువాత తుది వివరాలను ప్రకటించిన ఈసీ
x
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 62.59 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. పోలింగ్ పై ఎలక్షన్ కమిషన్ తుది వివరాలను ఆదివారం రాత్రి ప్రకటించింది....

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 62.59 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. పోలింగ్ పై ఎలక్షన్ కమిషన్ తుది వివరాలను ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. ఈసారి 62.59 శాతం నమోదయ్యిందని.. ఇది లోక్ సభ ఎన్నికల కంటే ఇది 2 శాతం ఎక్కువని ఈసీ తెలిపింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.12 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 5 శాతం తక్కువ పోలింగ్ నమోదైందని తెలిపింది. నియోజవర్గాల వారిగా పోలింగ్ శాతాన్ని వెల్లడించింది. ఈ క్రమంలో ఢిల్లీ కంటోన్మెంట్ సెగ్మెంట్ లో అతి తక్కువగా అంటే 45 శాతం మాత్రమే నమోదైంది.. బల్లిమరాన్ సెగ్మెంట్ లో మాత్రం ఏకంగా 71.60 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక ఈసారి కూడా అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకి పాల్పడినట్టు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఈ ఎన్నికల్లో దాదాపు 57 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్‌, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. ఇందులో 12.33 కోట్ల నగదు ఉండగా, 2.83 కోట్ల విలువైన మద్యం, అత్యధికంగా 42.32 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, ఆభరణాలు ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇవి గతం కంటే కూడా రెండు రెట్లు అధికంగా ఉన్నాయని తెలిపింది.

ఇదిలావుంటే ఈవీఎంలపై అపోహాలు వద్దని.. స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశామని ఈసీ స్పష్టం చేసింది. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నుంచి వివరాలు రాకపోవడం వల్లే ప్రకటన ఎన్నికల తుది వివరాలను ఆలస్యంగా ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. పోలింగ్ వివరాలు ఆలస్యం కావడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ అధికారులు ఇంతలా నిర్లక్ష్యం వహిస్తారా..? ఇన్ని రోజులూ నిద్రపోతున్నారా అంటూ ఫైర్ అయ్యారు. అయితే, కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తరువాత ఈసీ అధికారులు పోలింగ్ వివరాలు ప్రకటించడం సంచలనంగా మారింది. కాగా ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories