Coronavirus లైవ్ అప్డేట్స్ : మహారాష్ట్రలో ఒకే కుటుంబంలో 25 మందికి కరోనా పాజిటివ్!

కరోనా వైరస్ తో మరణాల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. మహారాష్ట్ర పూణే నగరంలో తొలి కరోనా మరణం నమోదు అయినట్టు ఆ అంగర మేయర్ మొహోల్ తెలిపారు. 52 సంవత్సరాల వ్యక్తీ కరోనా కారణంగా మృతి చెందారని ఆయన చెప్పారు. డయాబెటిస్..బీపీ సమస్యలున్న ఆయన కరోనా దెబ్బకు చికిత్స అందించినా కోలుకోలేకపోయారన్నారు. ఇక అయన దగ్గర బందువులను నగరంలో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉంచినట్టు తెలిపారు. మహారాష్ట్రలోని సంగ్లీలో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కొత్తగా 12 మందికి కహారాష్ట్రలో కరోనా సోకినట్టు తేలడంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్యా 215 కు చేరింది.

ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 27 కు చేరగా.. ఆదివారం నాటికి 1,091 పాజిటివ్ కేసులు ఉన్నట్లు తేలింది.

కరోనా లైవ్ అప్డేట్స్ కోసం క్రిందికి స్క్రోల్ చేయండి..

ఇండియాలో కరోనా ప్రభావాన్ని తెలిపే చిత్రం ఇది..


ఇండియాలో కరోనా ప్రభావం వివరాలు రాష్ట్రాల వారీగా..
Show Full Article

Live Updates

  • 30 March 2020 11:11 AM GMT

    కరోనా సంక్రమణను నివారించడానికి దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 7 రోజులుగా మహారాష్ట్రలో కర్ఫ్యూ అమలులో ఉంది. అయినప్పటికీ, నగరాల్లో కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు మరియు మెడికల్ షాపుల వద్ద ప్రజలు అధికంగా ఉన్నారు. అదే సమయంలో, ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో వలసపోతున్నారు. దీంతో రోడ్లపై జనం భారీగా కనిపిస్తున్నారు. పోలీసులు ఎంత వారించినా ప్రజలు ఈ ధోరణి మానడం లేదు. దాంతో కొందరిపై పొలిసులు లాటి ఛార్జ్ చేయవలసి వచ్చింది. దీనిపై సీఎం ఉద్ధవ్ థాకరే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.    - పూర్తి కథనం 

                                                                                                                                                                

Print Article
More On
Next Story
More Stories