Karnataka: కర్నాటకలో బీజేపీ సర్కార్‌ అవినీతిపై కాంగ్రెస్ ప్రచారోద్యమం

Karnataka: బెంగళూరు నగరంలో పే సీఎం పేరుతో పోస్టర్లు

Rama Rao
Published on: 21 Sept 2022 4:37 PM IST
Congress New Campaign Targets Karnataka CM Basavaraj Bommai over 40% Commission
X

Karnataka: కర్నాటకలో బీజేపీ సర్కార్‌ అవినీతిపై కాంగ్రెస్ ప్రచారోద్యమం

Karnataka: కర్నాటకలోని బీజేపీది అవినీతి ప్రభుత్వమంటూ కాంగ్రెస్ వినూత్న ప్రచారానికి తెర లేపింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫొటో, క్యూఆర్ కోడ్‌తో పే సీఎం అని ప్రింట్ వేయించిన పోస్టర్లను కాంగ్రెస్ నేతలు బెంగళూరు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుత బీజేపీ హయాంలో ఏ పని జరగాలన్నా 40 శాతం కమీషన్ అందించాల్సిందేనన్న సందేశంతో ఈ పోస్టర్లను రూపొందించారు. అంతేగాక బీజేపీ అవినీతి పాలనపై కంప్లయింట్ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ సర్కార్ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇలా ఉంటే బెంగళూరులో పే సీఎం పేరుతో వెలిసిన పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి.

Rama Rao

Rama Rao

Next Story