logo
జాతీయం

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదేళ్ల వయోపరిమితి సడలింపు

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదేళ్ల వయోపరిమితి సడలింపు
X
Highlights

నిరుద్యోగుల విషయంలో ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో నేరుగా జరిపే ఉద్యోగ నియామకాల్లో ...

నిరుద్యోగుల విషయంలో ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో నేరుగా జరిపే ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని సడలిస్తూ శుభవార్త వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం. ఉద్యోగ నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితిని సడలిస్తూ ముఖ్యమంత్రి భూపేష్ భాగల్ నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో రాజకీయ ఉద్యమాలకు సంబంధించి నమోదైన కేసులను ఎత్తివేసేందుకు హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి.

Next Story