చంద్రుని కక్ష్యలో చంద్రయాన్ 2

చంద్రుని కక్ష్యలో చంద్రయాన్ 2
x
Highlights

చంద్రయాన్ 2 చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా దూసుకు పోయింది. మరి కొన్ని రోజుల్లో జాబిల్లిని పలకరించడానికి వేగంగా ముందుకు కదులుతోంది చంద్రయాన్ 2

చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది. ఇందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. గతనెల 22న శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ద్వారా రోదసిలోకి చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని పంపించారు. అది 29 రోజుల తర్వాత ఈరోజు ఉదయం చంద్రుని కక్ష్యలోకి చేరుకున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఈరోజు ఉదయం 09:02 నిమిషాలకు లూనార్ ఆర్బిట్ ఇన్సర్టనేషన్ విజయవంతంగా పూర్తయినట్టు తెలిపింది. 1738 సెకన్ల లో ఆపరేషన్ పూర్తయింది. ప్రస్తుత ప్రయోగంతో 114 కి.మీ X 18072 కి.మీ. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ ప్రవేశించింది.

ఇంకా కొన్ని సార్లు ద్రవ ఇంధనాన్ని మండించడం ద్వారా చంద్రయాన్ చంద్రునికి వంద కిలోమీటర్ల దూరంలోని చవరి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. చంద్రుని 100X30 కి.మీ కక్ష్యలోకి చంద్రయాన్ ప్రవేశించిన తరువాత లాండర్ విడిపోయి చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో సెప్టెంబర్ 7 న దిగుతుందని ఇస్రో ప్రకటించింది.

ఇస్రోకి చెందినా మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్, ఐఎస్టీఆర్ఏసీ, ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ చంద్రయాన్ 2 ను పర్యవేక్షిస్తున్నట్టు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం అన్నీ సక్రమంగానే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని కార్యక్రమాలు అనుకున్నట్టు పూర్తవుతున్నాయని వివరించింది.

రేపు (21 ఆగస్టు) మధ్యాహ్నం మరోసారి చంద్రయాన్ 2 కక్ష్య మార్చే ప్రక్రియ ఉంటుందని ఇస్రో తెలిపింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories