మూగబోయిన చంద్రయాన్ 2

మూగబోయిన చంద్రయాన్ 2
x
Highlights

చంద్రయాన్ 2 చవరి నిమిషంలో సంకేతాలు ఆగిపోయాయి. ఒక్కసారిగా అందరినీ నిరాశలో ముంచేసింది విక్రం లాండర్. చంద్రునికి అతి సమీపంలోకి వెళ్ళేవరకూ అనుకున్నట్టుగానే తన పని చేసిన లాండర్ అనుకోని పరిస్థితిలో తన సంకేతాల్ని కోల్పోవడం అందర్నీ విషాదంలో ముంచేసింది.

ఊరించిన చందమామ ఉసూరు మనిపించింది. అనుకోని సాంకేతిక సమస్యతో చివరి క్షణాల్లో చంద్రయాన్ 2 ఇబ్బందుల్లో పడింది. అప్పటివరకూ అన్నీ అనుకున్నట్టే జరిగాయి. చంద్రుని ఉపరితలానికి 2.1 కిలో మీటర్ల దూరం వరకూ సజావుగా సాగిన విక్రం ప్రయాణం ఆ తరువాత ఏం జరిగిందో తెలియకుండా ఆగిపోయింది. ఇస్రోకు ఒక్కసారిగా సంకేతాలు ఆగిపోయాయి. దానితో పాటే శాస్త్రవేత్తల ఆశలు కూడా స్తంభించాయి. చంద్రుని ఉపరితలంపై ఏం జరిగింది అనేది డాటా ఎనాలిసిస్ తరువాత తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 47 రోజుల పాటు అన్నీ సక్రమంగా జరిగాయి. అయితే, చివరి నిమిషంలో చంద్రునిపై ఎటువంటి వాతావరణంలో ఇబ్బంది తలెత్తింది అనేది విశ్లేషిస్తున్నారు శాస్త్రవేత్తలు.

ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ..

జరిగిన దానికి బాధ పడవద్దు అంటూ ప్రధాని శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. జీవితంలో జయాపజయాలు సహజం. మీరు సాధించింది తక్కువేమీ కాదు. ఈ విషయంలో మీ వెంటే దేశం మొత్తం ఉంది. మీరు మళ్లీ మీ పనులు మొదలు పెట్టండి అంటూ సందేశం ఇచ్చారు ప్రధాని మోడీ చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories